గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతున్న బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. శనివారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.2 వేలు, కిలో వెండిపై రూ.3 వేలు పెరిగాయి. దీంతో ఇటీవల 14 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన పసిడి ధరలు తిరిగి కోలుకున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.29 లక్షలుగా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1.17 లక్షలకు చేరింది. కిలో వెండి ధర రూ.1.56 లక్షల వద్ద కొనసాగుతోంది.

ధరల పెరుగుదలకు కారణాలివే..

ఇటీవలి రోజుల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో బంగారం, వెండి ధరలు ఓవర్‌సోల్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా షార్ట్ కవరింగ్ జరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, ధరలు తగ్గడంతో కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

వీటికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ అప్రమత్తత నెలకొంది. ఈ పరిణామాలన్నీ బంగారం, వెండి ధరల కదలికలకు కారణమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *