డజను అరటిపండ్లు కొనుగోలు చేస్తే.. ఒకట్రెండు రోజుల్లోనే బాగా పండిపోయి మెత్తబడిపోతుంటాయి. దీంతో వాటిని తినలేక చాలామంది పడేస్తుంటారు. అయితే రోజుకు ఒక అరటిపండు చొప్పున వారం రోజుల పాటు తాజాగా ఉండేలా తినగలిగితే ఎంత బాగుంటుందో కదా! ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అరటిపండ్లు త్వరగా పండిపోకుండా, ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేసే ఈ ప్రత్యేక విధానం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.

డజను అరటిపండ్లు కొనుగోలు చేస్తే.. ఒకటి రెండు రోజుల్లోనే బాగా పండిపోయి మెత్తబడిపోతుంటాయి. దీంతో వాటిని తినడానికి ఇష్టపడక కొందరు పడేస్తుంటారు. అలాకాకుండా రోజుకో అరటిపండు చొప్పున వారం రోజుల పాటు తాజాగా తినాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియాలో ఓ వినూత్న ఆలోచనను అమలు చేశారు. ఇంతకీ ఆ ఐడియా ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా ఒక గెల నుంచి తెంపిన అరటిపండ్లు దాదాపు ఒకే సమయంలో పక్వానికి వస్తాయి. దీంతో వాటిని ఒకేసారి తినలేకపోతే త్వరగా మగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియాలోని ఇ-మార్ట్‌ సూపర్‌మార్కెట్‌ చైన్‌ వినూత్న ప్యాకేజింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఏడు అరటిపండ్లను ఒకే ప్యాక్‌లో విక్రయిస్తారు. ‘రోజుకు ఒక అరటిపండు’ అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ప్యాక్‌లో ప్రతి అరటిపండు ఒక్కో పక్వ దశలో ఉంటుంది. దీంతో ఒకటి తిన్న తర్వాత మరుసటి రోజు తినేందుకు మరో అరటిపండు సిద్ధంగా ఉండేలా ఈ ప్యాకేజింగ్‌ను రూపొందించారు.


ఈ ప్యాకింగ్‌లో అరటిపండ్లు పసుపు రంగు నుంచి క్రమంగా ఆకుపచ్చ రంగు వరకు వివిధ దశల్లో పండినట్లు ఉంటాయి. ఉదాహరణకు, పసుపు రంగులో ఉన్న అరటిపండును మొదటి రోజే తినవచ్చు. ఆ తర్వాతి పండ్లు ఒక్కొక్కటిగా పక్వానికి వస్తాయి. ఇలా రోజుకు ఒక అరటిపండు చొప్పున వారం రోజుల పాటు తాజాగా ఉన్న పండ్లను ఆస్వాదించవచ్చు. అరటిపండ్లు ఒకేసారి మగ్గిపోకుండా ఉండటంతోపాటు, పండ్లు వృథా కాకుండా నిరోధించేందుకు ఈ వినూత్న ప్యాకేజింగ్‌ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *