D Spiritual: Nov 12: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. కంపార్టుమెంట్లు, షెడ్లు భక్తులతో కిటకిట!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి.

భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లు శిలాతోరణం సర్కిల్‌ వరకు విస్తరించాయి. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ దర్శనం కోసం వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు

తిరుమల శ్రీవారి హుండీకి సోమవారం రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు.

బుధవారం దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 73,392, తలనీలాలు తీయించుకున్నవారు: 33,288, హుండీ కానుకలు: 3.90 కోట్లు, లద్దు అమ్మకం…3.71 లక్షలు, అన్నప్రసాదం…2.38 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *