D Spiritual: Nov 12: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ పేలుడు.. లడ్డూ పోటులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు!

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని లడ్డూ పోటులో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. సిలిండర్ పేలుడు శబ్దంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. లడ్డూ పోటులో సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

భారీగా ఆస్తి నష్టం?

ఈ ప్రమాదంలో ఆలయంలోని లడ్డూ పోటుకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *