
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య రామాలయ పరిపాలనకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆలయ చరిత్రలో తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించేందుకు ట్రస్టు సిద్ధమైంది.
ఈ మేరకు బుధవారం ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో జరగనున్న సమావేశంలో సీఈవో అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. సీఈవో పదవి కోసం వచ్చిన 5,500కు పైగా దరఖాస్తులను పరిశీలించిన ఎంపిక కమిటీ.. తుది జాబితాలో ముగ్గురి పేర్లను ట్రస్టుకు సమర్పించింది. ఈ ముగ్గురిలో ఒకరిని సీఈవోగా ఖరారు చేయడంతో పాటు, ట్రస్టులో నూతనంగా నియమించనున్న సభ్యుల పేర్లను కూడా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామాలయ పరిపాలనలో మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామకంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం అధికారిక ప్రకటన చేయనుంది.
ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఈవో ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను ట్రస్టుకు సమర్పించనుంది. అనంతరం సీఈవోగా ఎంపికైన వ్యక్తి పేరును అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఆలయ తొలి సీఈవో నియామకం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,585 మంది ఈ కీలక పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది. అభ్యర్థుల అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపిక కమిటీ.. చివరి దశకు 16 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది.
రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుడు సురేష్ హావ్డేలతో కూడిన ప్రత్యేక కమిటీ ఇప్పటికే అయోధ్యకు చేరుకుంది. ముగ్గురు సభ్యులు సమావేశమై తుది ఎంపిక ప్రక్రియపై చర్చించనున్నారు.
ఇంటర్వ్యూల అనంతరం కమిటీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన షార్ట్‌లిస్ట్‌ను సిద్ధం చేయనుంది. ఈ జాబితా నుంచి ఒకరిని ఆలయ ట్రస్టు తుది సీఈవోగా ఎంపిక చేయనుంది.
