వెయిట్ లాస్ కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు కేవలం 56 రోజుల్లో 9 కేజీల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తన బరువు తగ్గడానికి పాటించిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చేసిన మార్పులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆమె వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లడంతో పాటు డైట్‌ను కూడా పాటిస్తున్నారు. అయితే సరైన మార్గదర్శకత్వం లేకుండా చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితాలు కనిపించకపోవచ్చు. ఇలాంటి వారికి ఉపయోగపడేలా కేవలం రెండు నెలల్లో 9 కేజీల బరువు తగ్గిన ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ తన వెయిట్ లాస్ జర్నీతో పాటు డైట్ సీక్రెట్‌ను వెల్లడించింది. మరి ఆమె ఎలాంటి ఆహార నియమాలు పాటించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే కేవలం జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడం మాత్రమే సరిపోదు. వ్యాయామంతో పాటు సరైన ఆహార నియమాలను కూడా పాటించాలి. చాలామంది క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో బరువు తగ్గడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే ఓ ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ కేవలం 56 రోజుల్లో దాదాపు 9 కిలోల బరువు తగ్గి, తాను పాటించిన డైట్, వర్కౌట్ రొటీన్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి, ఇతరుల డైట్ లేదా వర్కౌట్‌ను నేరుగా అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇన్‌ఫ్లూయెన్సర్ తాన్యా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. కేవలం 56 రోజుల్లో 75 కిలోల నుంచి 66 కిలోలకు తగ్గినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తాను అనుసరించిన డైట్ ప్లాన్, వర్కౌట్ రొటీన్ గురించి వివరించారు. తాన్యా తన డైట్‌ను నాలుగు దశలుగా విభజించి.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో తీసుకునే ఆహారాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు.
మార్నింగ్: ఉదయం జిమ్‌కు వెళ్లే ముందు 4 ఉడికించిన గుడ్లు తినేదానినని తాన్యా సింగ్ తెలిపింది. అయితే ప్రతిరోజూ ఒకే విధంగా కాకుండా, గుడ్లను వివిధ రకాలుగా వండుకుని తినేదానినని ఆమె చెప్పుకొచ్చింది.
మధ్యాహ్నం: మధ్యాహ్న భోజనంలో 2 రొట్టెలతో పాటు బెండకాయ కూర, ఒక కప్పు రాజ్‌మా, కీరదోసకాయ, క్యారెట్ ముక్కలను తీసుకునేదానినని ఆమె తెలిపింది. ఈ ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్ సమతుల్యంగా లభిస్తాయని ఆమె పేర్కొంది.
సాయంత్రం: ఇక సాయంత్రం స్నాక్‌లోకి తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ ఉండేలా కూరగాయలు కలిపిన ఎగ్ భుర్జీ తినేదానన్ని తెలిపింది.
నైట్: ఇక డే ఎండింగ్లో రాత్రి భోజనం కోసం ఉల్లిపాయలు, పచ్చి చట్నీతో పాటు 4 రోస్టెడ్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకునేదాన్నని తెలిపింది.
తాన్యా జిమ్ వర్కౌట్ ప్లాన్
జిమ్ వర్కౌట్‌లో భాగంగా తాన్యా ఉదయం ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌తో వ్యాయామాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. అనంతరం ఇన్వర్టెడ్ రోస్, ఫోర్‌ఆర్మ్ ప్లాంక్స్, బార్‌బెల్ బెంట్-ఓవర్ రోస్, రొమేనియన్ డెడ్‌లిఫ్ట్స్ వంటి బాడీవెయిట్, స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసేదానినని చెప్పింది. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో కూడా యాక్టివ్‌గా ఉండేందుకు గోల్ఫ్ ఆడటంతో పాటు రోజుకు 10,000 అడుగులు నడవడం తన దినచర్యలో భాగం చేసుకున్నట్లు వెల్లడించింది. సరైన డైట్‌ను క్రమం తప్పకుండా పాటిస్తూ, వర్కౌట్స్‌లోనూ స్థిరత్వాన్ని కొనసాగిస్తే బరువు తగ్గే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తాన్యా తెలిపింది.

