Andre Russell 46 off 18 balls: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆండ్రీ రసెల్ బ్యాట్ ఇంకా శాంతించలేదు. అబుధాబి టీ10 లీగ్‌లో యూఏఈ బుల్స్‌తో మ్యాచ్‌లో 29/6 వద్ద కుప్పకూలిన అరేబియన్ ఏసెస్‌ను 18 బంతుల్లో 46 పరుగులతో ఒంటిచేత్తో గెలిపించాడు. బంతితో 12 పరుగులిచ్చి 3 వికెట్లు.. పోలార్డ్, నరైన్‌లనే బోల్తా కొట్టించాడు.

కొందరు ఆటగాళ్లు వయసుతో పాటు తగ్గుతారు. కొందరు వయసును వెనక్కి నెట్టి మరీ విజృంభిస్తారు. వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రసెల్ రెండో కోవకు చెందినవాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. అతడి బ్యాట్‌లోని మందుగుండు ఇంకా తగ్గలేదని అబుధాబి టీ10 లీగ్‌లో మరోసారి రుజువు చేశాడు.

నవంబర్ 13న యూఏఈ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరేబియన్ ఏసెస్ తరఫున ఆడిన రసెల్.. ఒక్కడే రెండు పాత్రలు పోషించాడు. సంక్షోభంలో ఆదుకున్న హీరోగా, ప్రత్యర్థిని కూల్చిన విలన్‌గా మారాడు.

29/6.. శిథిలాల నుంచి విధ్వంసానికి..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అరేబియన్ ఏసెస్ ఒక్కసారిగా 29 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అభిమానులు టీవీలు కట్టేయాలనుకున్న సమయంలో రసెల్ క్రీజులోకి వచ్చాడు.

రసెల్ జోరుకు బ్రేకే లేదు..!

ఈ సీజన్‌లో రసెల్ ఫామ్ మామూలుగా లేదు. ఇప్పటిదాకా 6 మ్యాచ్‌ల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 41.66 సగటుతో 125 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 46. నవంబర్ 14న ఎమిరేట్స్ ఈగల్స్‌తో మ్యాచ్‌లో కూడా 225 స్ట్రైక్ రేట్‌తో 16 బంతుల్లో 36*తో అజేయంగా నిలిచాడు.

ముసలివాడయ్యాడని అనుకున్నారా? బ్యాట్ పట్టుకుంటే ఇప్పటికీ యువ బౌలర్లకు వణుకు పుడుతుందని రసెల్ మళ్లీ నిరూపించాడు. టీ10 అంటేనే రసెల్ షో..!

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *