అమెరికా-ఇరాన్ మధ్య పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ల మధ్యవర్తిత్వం.. యుద్ధం ఆపేందుకు వీరు ఏం చేస్తున్నారంటే?

Date:

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్‌ను శాంతి వేదికగా మార్చేందుకు పాక్ పావులు కదుపుతోంది. అటు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్లతో ఉన్న చారిత్రాత్మక సంబంధాలను వాడుకుంటూ.. పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత రహస్యంగా దౌత్య చర్చలను కొనసాగిస్తున్నారు. మరి వీరి మధ్యవర్తిత్వం మధ్య యుద్ధం ఆగతుందా లేదా అనేది చూడాలి.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ, అటు ఇరాన్ అగ్రనేతలతోనూ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఇస్లామాబాద్ సిద్ధం అయింది. ముఖ్యంగా అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ ఉన్నతాధికారుల మధ్య ఈ వారంలోనే ఇస్లామాబాద్ వేదికగా కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరు దేశాధినేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడగా.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో చర్చలు జరిపారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం వెనుక పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించింది. “కొన్ని మిత్ర దేశాల ద్వారా అమెరికా నుంచి చర్చల ప్రతిపాదనలు అందాయి. వాటికి మా ప్రాథమిక సిద్ధాంతాలకు అనుగుణంగా సమాధానం ఇచ్చాం” అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాకాయీ పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...