యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు.. మార్కెట్లలో జోష్.. నిమిషాల్లో రూ. 10 లక్షల కోట్లు లాభం

Date:

భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లో మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కాస్త శాంతించిందని తెలుస్తోంది. కిందటి రోజే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల పాటు దాడుల్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. సూచీలు పుంజుకున్నాయి. కిందటి రోజు సెన్సెక్స్ ఏకంగా 1372 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 400 పాయింట్లు పుంజుకుంది. ఇవాళ మార్చి 25న ట్రంప్ మరో ప్రకటన చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు కూడా అంగీకరించిందని చెప్పారు.

ఇక్కడ ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా దిగొచ్చాయి. కిందటి రోజు 100 డాలర్లకుపైగా ఉండగా.. ఇవాళ 5 శాతానికిపైగా పడిపోయింది. ప్రస్తుతం 95 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 93 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని చెబుతున్నారు.

క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మార్చి 25న వార్త రాసే సమయంలో ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 1600 పాయింట్లకుపైగా లాభపడి 75,650 మార్కుపైన కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పెరిగి 400 స్థాయిలో ఉంది. సెషన్ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్ల వరకు లాభాల్లో ప్రారంభమైంది సెన్సెక్స్.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...