హైదరాబాద్, చెన్నై వైపు వెళ్లేవారికి ఊరట.. ఈ నెలాఖరుకు విజయవాడ బైపాస్ రెడీ, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

Date:

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ లోపు 27 నుంచి కాజ దగ్గర విజయవాడ బైపాస్‌లో ఇరువైపులా రాకపోకలకు అనుమతించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాలను అనుమతించే అవకాశం ఉందంటున్నారు.. ఈ మేరకు టోల్ కూడా వసూలు చేయాలని భావిస్తున్నారు.

విజయవాడ ప్రజలకు పండగే.. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే బైపాస్ ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేయొచ్చు. విజయవాడ బైపాస్‌కు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ పనుల్ని ముగింపుకు తీసుకొచ్చింది. ఈ బైపాస్‌ మొత్తం 47 కిలోమీటర్లను రెండు ప్యాకేజీలుగా పనులు చేశారు. ఈ బైపాస్‌ను చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా.. గొల్లపూడి నుంచి కాజ వరకు 17 కి.మీ మరో ప్యాకేజీగా పనులు చేశారు.

ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే.. కోల్‌కతా-చెన్నై హైవే-16లో వెళ్లే వాహనాలు విజయవాడలోకి రావాల్సిన అవసరం ఉండదు. ఈ బైపాస్ గొల్లపూడి దగ్గర విజయవాడ-హైదరాబాద్‌ నేషనల్ హైవే 65 పైనుంచి వెళుతుండగా.. హైవేలో సర్కిల్‌ కూడా నిర్మిస్తున్నారు. ఈ సర్కిల్‌ ద్వారా బైపాస్‌లో వచ్చే వాహనాలు ఎటువైపైనా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. కొద్ది రోజులుగా చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య బైపాస్‌ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించారు. చిన్నఅవుటపల్లి దగ్గర పెండింగ్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయంటున్నారు.

విజయవాడ బైపాస్ ‌కు సంబంధించి అంబాపురం దగ్గర ల్యాంకో పవర్‌కు చెందిన హెచ్‌టీ విద్యుత్‌లైన్‌ దగ్గర బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. భారీ వాహనాలకు విద్యుత్ లైన్లు తగిలే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బైపాస్‌కు ఇరు వైపులా రెండు ఎత్తైన టవర్లు నిర్మించి లైన్లు మార్చాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై కాస్త గందరగోళం ఉండటంతో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ వంతెన ఆగిపోవడంతో ఆ కూడలిలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. మొత్తం విజయవాడ బైపాస్ 47 కిలోమీటర్లలో చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు అంబాపురం బ్రిడ్జి 90 మీటర్లు మినహా మిగిలిన బైపాస్‌ అంతా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. వెదురుపావులూరు, వెంకటపాలెం దగ్గర ఈ బైపాస్‌లో రెండు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు.. ఈ వారంలోనే టోల్ ఫీజులు ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి వసూలు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...