భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం పటేల్ చేసిన అపార సేవలను స్మరించుకున్నారు.

ఈ మేరకు శనివారం తన ఎక్స్ (X) ఖాతాలో చంద్రబాబు ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారతదేశాన్ని ఏకం చేసి అఖండ భారత నిర్మాణానికి పటిష్ఠమైన పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.

దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు ఆయన చేసిన అసమాన కృషికి గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 31న ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పటేల్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత ఉక్కు సంకల్పం యావత్ జాతికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు అన్నారు. దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యతగా దృఢ సంకల్పంగా మారాలని పిలుపునిచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *