
D Educt: Nov 4: CAT 2026 అడ్మిట్ కార్డులు నేడే విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
ఐఐఎం ఇందౌర్ నవంబరు 4న క్యాట్ (CAT-2026) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో డౌన్లోడ్
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డును పొందవచ్చు. హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి.
నవంబరు 29న క్యాట్ పరీక్ష
క్యాట్ 2026 పరీక్ష నవంబరు 29న మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్‌లో సూచించిన నిబంధనలు, మార్గదర్శకాలను పూర్తిగా చదివి పాటించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.
