Tension in Palnadu: TDP Workers Attacked with Sticks, Three Injured

పల్నాడు: జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో అర్ధరాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు సమాచారం.

for more :Mptc Zptc election ubdates in dtv digital

ఈ దాడికి వైసీపీ కార్యకర్తలే కారణమని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. ఘటనతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://dtvandhrapradesh.com