AP MPTC, ZPTC Elections: Markapuram Records Highest Polling, ASR District Sees Lowest Turnout

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 21.12 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్ శాతం.. రెండు గంటల్లోనే గణనీయంగా పెరిగింది.

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలను పరిశీలిస్తే ఉదయం 11 గంటల వరకు మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 34.66 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లాలో అత్యల్పంగా 11.81 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

ఇతర జిల్లాల్లో పోలింగ్ శాతం ఇలా..

ఉదయం 11 గంటల వరకు విశాఖపట్నంలో 35.4 శాతం, పల్నాడు జిల్లాలో 32.02 శాతం, కడపలో 29.31 శాతం, కాకినాడలో 27.25 శాతం, ఏలూరులో 26.6 శాతం, గుంటూరులో 23 శాతం పోలింగ్ నమోదైంది.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

రెండు గంటల్లో పెరిగిన ఓటింగ్ శాతం

ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటు పోలింగ్ 11.719 శాతంగా నమోదైంది. అప్పటికి పల్నాడు జిల్లాలో 12 శాతం, అనంతపురంలో 9.44 శాతం, కాకినాడలో 8.83 శాతం ఓటింగ్ నమోదైంది. కడప జిల్లాలో అత్యల్పంగా 0.5 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఉదయం 9 గంటలతో పోలిస్తే 11 గంటల సమయానికి పోలింగ్ శాతంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఓటింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.