
హైదరాబాద్లో అక్రమంగా అండాలను సేకరించిన వ్యవహారంపై మల్కాజ్గిరి పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మూడు ఆస్పత్రుల పాత్రను గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. అలాగే 22 ఫెర్టిలిటీ సెంటర్లకు, ఏఆర్టీ కేంద్రాలకు మధ్య ఉన్న సంబంధాలపైనా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న హార్మోన్ల ఇంజెక్షన్లను పోలీసులు పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. వాటిని బాధిత మహిళలకు వినియోగించారా? ఒకవేళ వినియోగిస్తే వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడింది? అనే విషయాలు ల్యాబ్ నివేదిక ద్వారా వెల్లడికానున్నాయి. మరోవైపు బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించిన ఆస్పత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
హైదరాబాద్లో బయటపడిన అక్రమ అండాల సేకరణ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పేదరికంలో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మూడు ఆస్పత్రుల పాత్రను గుర్తించామని, 22 ఫెర్టిలిటీ సెంటర్లు, ఏఆర్టీ కేంద్రాల మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో నిందితుల వద్ద లభించిన హార్మోన్ల ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని బాధిత మహిళలకు వినియోగించారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని సీపీ సుమతి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పరీక్షల కోసం పంపించినట్లు చెప్పారు. ల్యాబ్ నివేదిక అందిన తర్వాతే వాటి వినియోగంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) కేంద్రాల నుంచి ఫెర్టిలిటీ సెంటర్లకు అండాల దానానికి సంబంధించిన పూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు చేరాల్సి ఉంటుందని సీపీ వివరించారు. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ అక్రమ అండాల సేకరణ వ్యవహారానికి సంబంధించి మూడు ఫెర్టిలిటీ కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 22 ఫెర్టిలిటీ సెంటర్లకు, ఏఆర్టీ కేంద్రాలకు మధ్య ఉన్న సంబంధాలపై సమగ్రంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. పెళ్లి కాని మహిళలను వివాహమైనట్లు, భర్త లేని వారిని భర్త ఉన్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేసి వారి నుంచి అండాలను సేకరించినట్లు గుర్తించారు. ఈ అక్రమ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
