హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

Date:

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 1263 ఎకరాల్లో 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. మిగిలిన భూమిలో ఉన్న నివాస గృహాల జోలికి వెళ్లకుండా.. ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ప్రభుత్వ ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపురంలో హైడ్రా అధికారులు.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల్లో ఇళ్లను మాత్రం కూల్చడం లేదని హైడ్రా అధికారులు తేల్చి చెప్పారు.

ఐలాపురం గ్రామం, తండాలో ఉన్న నివాస గృహాల జోలికి కానీ హైడ్రా అధికారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఐలాపురం గ్రామంలో ఉన్న 1263 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, సీజ్ చేసుకున్న ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...