
మంత్రి నారా లోకేశ్
అమరావతి, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వైద్యులు ఆమెకు ఆహారం అందించడం ప్రారంభించారని, ప్రస్తుతం కుర్చీలో సౌకర్యంగా కూర్చుంటోందని వెల్లడించారు. త్వరలోనే కొన్ని అడుగులు వేయగలదని ఆశిస్తున్నట్లు ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
