
నటుడు ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ప్రకాష్ రాజ్ తనను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన ఒక కపట లౌకికవాది అని, కేవలం ద్వేషాన్ని మాత్రమే రగిలిస్తారని మధుర శ్రీధర్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్, విజయ్ వంటి వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే, ప్రకాష్ రాజ్ మాత్రం చిన్న ‘మా’ ఎన్నికల్లో కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. మోదీని, బీజేపీని ద్వేషించే ప్రకాష్ రాజ్.. దమ్ము ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతూ ఉంటారు. అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ పార్టీని తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు వివాదానికి దారితీస్తుంటాయి. అయితే జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరినీ ప్రశ్నించే ప్రకాష్ రాజ్ పై ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రమ్మంటూ ఛాలెంజ్ విసిరారు.
ప్రకాష్ రాజ్ తనను ట్విట్టర్ (ఎక్స్)లో బ్లాక్ చేశారనే విషయాన్ని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రకాష్ రాజ్ తనను తాను మేధావిగా, ఉదారవాదిగా భావిస్తారని, కానీ వాస్తవానికి ఆయన సంకుచిత మనస్తత్వం కలవారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ద్వేషిస్తారని, ఇతరులను విమర్శించే ఆయన స్వయంగా ఒక ‘హేట్ మాంగర్’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ విమర్శించిన సినీ నటులు విజయ్ ఎన్నికల్లో గెలిచారని, కానీ అతడు మాత్రం ‘మా’ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయారని సెటైర్లు వేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

