హ్యాపీ బర్త్ డే తమ్ముడూ.. JR ఎన్టీఆర్‌కు కొడాలి నాని విషెస్.. ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్

Date:

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. కొడాలి నాని ట్వీట్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అభిమానునులు తారక్ బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. తారక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మాజీ మంత్రి, వైఎస్సార్‌‌‌సీపీ నేత కొడాలి నాని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా తమ్ముడు.. జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. కొడాలి నాని, తారక్, వల్లభనేని వంశీలు కలిసి చాలా క్లోజ్‌గా ఉన్నప్పుడు దిగిన పాత ఫోటోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త కొత్త ఫోటో పెట్టొచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు.

కొడాలి నాని ట్వీట్ చేసిన ఫోటోలో కొడాలి నానిపై జూనియర్ ఎన్టీఆర్ కాలు వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీల మధ్య సాన్నిహిత్యం ఉంది. కొడాలి నానికి తారక్ తండ్రి హరికృష్ణ అంటే గౌరవం, అభిమానం. కొడాలి నాని టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. అప్పటి నుంచి ఎన్టీఆర్‌తో అనుబంధం ఉంది. అంతేకాదు వల్లభనేని వంశీ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా కూడా చేశారు. కొడాలి నాని తారక్‌తో సాంబ సినిమా తీశారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో సినీ వ్యవహారాలను, డేట్స్‌ను దగ్గరుండి చూసుకునేవారని చెబుతుంటారు. కొడాలి నాని కోసం జూనియన్ ఎన్టీఆర్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...