D Educt: Nov 7: ఏపీపీఎస్సీ నుంచి ఐదు రకాల పోస్టులకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసిన ఐదు రకాల పోస్టులకు తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆయా పోస్టులకు సంబంధించిన ఖాళీల సంఖ్య, వేతనాలు, వయోపరిమితి, సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతలు, ఇతర నియామక నిబంధనలతో కూడిన పూర్తి వివరాలను కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ నోటిఫికేషన్ల ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ (మైన్స్), టెక్నికల్ అసిస్టెంట్ (మైన్స్), ల్యాబ్ అసిస్టెంట్ (మైన్స్), అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ (ఎక్సైజ్), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, నిబంధనలు, ఇతర వివరాలను పూర్తిగా పరిశీలించాలి.