
హైదరాబాద్, అల్లం బుచ్చవ్వ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాతృవియోగంతో శోకంలో ఉన్న ఆమె కుమారులు అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణకు ముగ్గురు ప్రముఖులను అందించిన మాతృమూర్తి
తెలంగాణ సాహిత్యం, జర్నలిజం రంగాల్లో తమదైన ముద్ర వేసిన అల్లం సోదరులు రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి ముగ్గురు కుమారులను తెలంగాణకు అందించిన మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ అని కొనియాడారు.
తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అల్లం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
