
బీబీనగర్, నవంబర్ 09, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీబీనగర్ మండల రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 30 మంది యువకులు ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, భువనగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలు, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వివిధ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్‌లో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై యువతలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్‌వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొంతం భాస్కర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కసగోని ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ పర్వతం కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
