
D Educt: Nov 9: అఖిల భారత కోటాలో పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ నవంబరు 7న విడుదలైంది. ఈ కౌన్సెలింగ్లో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు నవంబరు 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నవంబరు 17 నాటికి సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
