ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై వైద్య ఆరోగ్య శాఖ ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది. రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో కొన్ని అంశాలపై 100 శాతం అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో 135 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు, జులై నుంచి నవంబర్ వరకు నిర్వహించిన సర్వేలో యూపీహెచ్‌సీల పనితీరులో పల్నాడు జిల్లా 81.6 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పోలవరం 81.5 శాతంతో రెండో స్థానంలో, నెల్లూరు 80.7 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల్లో కర్నూలు 69.5 శాతం, అనంతపురం 69.8 శాతం, ఎన్టీఆర్ జిల్లా 70.9 శాతంతో ఉన్నాయి.

పీఎం-వీజీఎస్‌వై కమిటీలో కృష్ణతేజ

ప్రధానమంత్రి వికసిత్ గ్రామస్వరాజ్ యోజన (పీఎం-వీజీఎస్‌వై) అమలు, మార్గదర్శకాల రూపకల్పన కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు చోటు దక్కింది. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఐదుగురు ప్రతినిధుల్లో ఆయన ఒకరు. గ్రామస్థాయి పాలనను మెరుగుపరచడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా అట్టాడ బాబూజీ

ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అట్టాడ బాబూజీ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న ఆయనను సీఐఎస్‌ఎఫ్ డీఐజీగా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ఆయనను ఏపీ క్యాడర్ నుంచి రిలీవ్ చేస్తూ సీఎస్ జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు.

ఏపీఎండీసీకి మరో రూ.115 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ

బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ తీసుకోనున్న మరో రూ.115 కోట్ల బ్యాంకు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే రూ.906.52 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. తాజాగా అదనపు రుణానికి కూడా హామీ ఇస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. బొగ్గు వేలంలో డిపాజిట్ చెల్లించేందుకు ఏపీఎండీసీ ఈ రుణాలను వినియోగించుకోనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *