పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర అభినందనలు తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిమను బహూకరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమికి లభించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుభవజ్ఞమైన పాలన పార్టీ శ్రేణుల్లో మంత్రి నారా లోకేశ్‌ నింపుతున్న ఉత్సాహం ఎన్నికల్లో తిరుగులేని విజయానికి ప్రధాన కారణమని నరేంద్ర పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో కూటమి సాధించిన విజయానికి నాయకత్వం, పార్టీ కార్యకర్తల కృషి దోహదపడ్డాయని అభినందించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *