ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను మంత్రి నారాయణ స్వీకరించనున్నారు.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపికయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీ ఈ గుర్తింపును దక్కించుకున్నాయి.

అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • సూపర్ స్వచ్ఛ లీగ్: విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు సాధించాయి.
  • ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైంది.
  • సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్: విశాఖపట్నం (GVMC) అవార్డును దక్కించుకుంది.
  • 20 వేలలోపు జనాభా కేటగిరీ: స్వచ్ఛ నగరంగా కుప్పం మున్సిపాలిటీ అవార్డు సాధించింది.

ఈ కార్యక్రమానికి ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు కూడా హాజరుకానున్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పట్టణ పరిశుభ్రత మెరుగుదలకు చేపడుతున్న చర్యలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలుస్తున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *