ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

11:11 గంటలకు పార్టీ ఆవిర్భావం

నవంబర్ 11న ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయసాయిరెడ్డి పార్టీని ప్రకటించారు. 11వ నెల, 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలను ముహూర్తంగా ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ

పరివర్తన రాజనీతి పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీ ప్రధాన లక్ష్యాలు, విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో పార్టీలోకి ఎవరెవరు చేరనున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీ ఎలాంటి పాత్ర పోషించనుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ ప్రయాణం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *