రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులకు 714 ఎంఓయూలు.. ఇప్పటికే రూ.7.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాల్లో 74 శాతం అమలు దిశగా సాగుతున్నాయని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల పురోగతి వివరాలను ఆయన వెల్లడించారు.

రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

2024 జూన్ నుంచి ఇప్పటివరకు మొత్తం 714 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. వీటి ద్వారా రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, 526 ప్రాజెక్టులు రూ.17.1 లక్షల కోట్ల పెట్టుబడి విలువతో అమలు దిశగా ముందుకు సాగుతున్నాయని వివరించారు.

ఇప్పటికే రూ.7.3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం

మొత్తం పెట్టుబడుల్లో రూ.7.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయని సీఎం వెల్లడించారు. మరో 303 ప్రాజెక్టుల అమలుకు నిర్దిష్ట గడువులు నిర్ణయించినట్లు తెలిపారు.

పెట్టుబడుల ఒప్పందాలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడం రాష్ట్రానికి కీలక విజయమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *