1, 2 తరగతులకు హోంవర్క్ రద్దు.. మిగిలిన తరగతులకు సమయ పరిమితులు

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హోంవర్క్, స్కూల్ బ్యాగ్ బరువుపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

  • 1, 2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదు.
  • 3 నుంచి 5వ తరగతి వరకు వారానికి రెండు గంటలకు మించకూడదు.
  • 6 నుంచి 8వ తరగతి వరకు రోజుకు గంట మాత్రమే ఇవ్వాలి.
  • 9వ తరగతి ఆపై విద్యార్థులకు రోజుకు రెండు గంటల వరకు హోంవర్క్ ఇవ్వవచ్చు.

స్కూల్ బ్యాగ్ బరువుపై ప్రత్యేక నిబంధనలు

విద్యార్థుల శరీర బరువులో స్కూల్ బ్యాగ్ బరువు 10 శాతానికి మించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. బ్యాగుల బరువును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. రెండు భుజాలకు తగిలించుకునే బ్యాగులనే అనుమతించాలని, బ్యాగుల బరువును నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించింది.

2,721 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ దరఖాస్తులు

మరోవైపు ఏపీలో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నోటిఫికేషన్, సిలబస్, పరీక్ష షెడ్యూల్ తదితర వివరాలు https://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *