D Spoiritual: Nov 13: ఆనం రామనారాయణరెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు.

దర్శనానంతరం ఆలయ వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని మంత్రికి అందజేసి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *