
మోపిదేవి, మోపిదేవి లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నాగుల చవితి అనంతరం వచ్చిన ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం విచ్చేశారు.
ఆలయంలోపల ఆలయం వెలుపల భారీగా భక్తులు ఉండడంతో స్వామివారి దర్శనానికి కొద్దిసేపు ఆలస్యం అయింది. తొలుత నాగపుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి.
