మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ పట్టణంలోని ప్లాటినమ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలకు నిప్పంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో గోదాములో నిల్వ ఉన్న కెమికల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.

రసాయనాల వల్లే ప్రమాదమా?

ఉరాన్ పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలు పొరపాటున ఒలికిపోవడం వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానిక పోలీస్ కమిషనర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *