
ఈ కారిడార్‌లో భాగంగా విజయవాడకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అమరావతి ప్రధాన నగరంలోనే స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, విజయవాడ ప్రజలకు కూడా సులభంగా అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
శంలో హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఈ కారిడార్‌లో అమరావతిలో నిర్మించనున్న రైల్వే స్టేషన్‌పై తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. విజయవాడకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమరావతి ప్రధాన నగరంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ (NHSRCL) ఆమోదం తెలిపినట్లు సమాచారం. విజయవాడ ప్రజలకు కూడా బుల్లెట్ రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ ప్రణాళిక రూపొందించారు
హైస్పీడ్ రైల్ కారిడార్ విజయవాడ నగరానికి దూరంగా ఉంటే ప్రయాణికులు బుల్లెట్ రైలు ఎక్కేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా అమరావతి రైల్వే స్టేషన్‌ను నగరానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 760 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 518 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ కారిడార్ దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకోనుంది.
మరోవైపు తెలంగాణలో ఈ కారిడార్ మార్గంపై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా ఏపీ వైపు వెళ్లేలా ఒక ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించారు. అయితే ఈ మార్గం హైదరాబాద్‌కు దూరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలైన్మెంట్పై తుది నిర్ణయం వెలువడకపోవడంతో నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ (NHSRCL) అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే (FLS), డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు సమాచారం.
చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ విషయంలోనూ ఇంకా స్పష్టత రావడం లేదు. గతంలో తమిళనాడు ప్రభుత్వం పెరందూరు వద్ద కొత్త విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించింది. దీంతో ఆ విమానాశ్రయానికి సమీపం నుంచి చెన్నై–చిత్తూరు–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ వెళ్లేలా మార్గాన్ని రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం పెరందూరు విమానాశ్రయ ప్రతిపాదనను మరో ప్రాంతానికి మార్చడంతో హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్పై అనిశ్చితి నెలకొంది. రైల్వే కారిడార్‌ను ఏ మార్గంలో నిర్మించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ తిరుపతి మీదుగా, చెన్నై–బెంగళూరు కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లేలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి–చిత్తూరు మధ్య లింక్ కారిడార్ ఏర్పాటు చేస్తే రెండు మార్గాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని ఏపీ ప్రభుత్వం గతంలో కేంద్రానికి ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి, ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే చెన్నై–బెంగళూరు కారిడార్ ఎలైన్మెంట్పై ఇంకా తుది స్పష్టత రాకపోవడంతో తిరుపతి–చిత్తూరు లింక్ కారిడార్ ప్రతిపాదన కూడా ముందుకు సాగడం లేదు.
