ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. టోల్ ప్లాజాల వద్ద ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే విధానంపై వాహనదారులకు కీలక సూచనలు చేశారు. వాహనదారుల భద్రతతో పాటు రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ విధానానికి అనుగుణంగా వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలని తెలిపారు. ఇన్సూరెన్స్ గడువు ముగియకముందే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.

ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి జరిమానాలు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దని మంత్రి హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని వాహనదారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *