APPSC నిరుద్యోగులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని 10 థానేదార్ పోస్టుల భర్తీకి సంబంధించి వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబర్ 30న రాజమహేంద్రవరంలో వాకింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అనంతరం వైద్య పరీక్షలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ పోస్టుల భర్తీకి సంబంధించి వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాలని కమిషన్ సూచించింది. గత ఏడాది 10 థానేదార్ పోస్టుల భర్తీ కోసం APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 9, 10 తేదీల్లో నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలను నవంబర్ 30న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. మహా పుష్కర వనం (నగరవనం)లోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ సమక్షంలో వాకింగ్ టెస్ట్ జరగనుంది. వాకింగ్ టెస్ట్ అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికవుతారు. వాకింగ్ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ పరీక్ష మెమోతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరి దశలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. కాబట్టి అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. థానేదార్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే తాజా ప్రకటనలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *