ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త అందించింది. డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం అమలుకు రూ.231.13 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ పథకం కింద అర్హులైన ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు పథకం అమలుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అర్హులైన ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ముందుకు సాగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం అమలులో భాగంగా వెనుకబడిన తరగతులకు చెందిన ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు బీసీ సంక్షేమ శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ వాహనాలకు యజమానులుగా ఉండటంతో పాటు, స్వయంగా వాటిని నడుపుతూ జీవనం సాగించే అర్హులకు ఈ పథకం ద్వారా ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.

తాజాగా ప్రభుత్వం నిధుల విడుదలకు అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే అర్హులైన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15,000 చొప్పున జమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్లకు ఊరట లభించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం తొలి ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు మొత్తం రూ.436 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

ఈ పథకం ద్వారా సుమారు 2.64 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు లబ్ధి పొందారు.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఈ పథకం వల్ల తమ ఆదాయంపై ప్రభావం పడుతోందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా డ్రైవర్ల సంక్షేమం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసే అవకాశం

ఈ పథకానికి అర్హత ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పథకం ప్రయోజనం పొందాలంటే లబ్ధిదారుల వద్ద ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

వాహనదారులకు గ్రీన్ ట్యాక్స్ ఊరట

మరోవైపు పాత వాహనాలపై గతంలో అమల్లో ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను కూడా ఏపీ ప్రభుత్వం తగ్గించింది. గతంలో రూ.20,000గా ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను రూ.3,000కు తగ్గించడంతో పాత వాహనాల యజమానులకు ఆర్థిక భారం తగ్గనుంది.

ఆర్థిక సాయం, పన్ను తగ్గింపుల ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *