అనంతపురం ప్రతినిధి, జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ సమత పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమైన అసిస్టెంట్ కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ నెల 19న ఎంపీపీ, 20న జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *