Kishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు..

Date:

ishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు..

Centre Govt allocates Tadicherla Coal Block-2 to Singareni : తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం అధిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీలో సింగరేణికి తాడిచర్ల బ్లాక్ -2ను కేటాయిస్తూ కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో తెలంగాణ వాసులకు సుమారు 2,700 కొత్త ఉద్యోగాల వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రజలకు, సింగరేణి ఉద్యోగులకు, కార్మిక లోకానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకే (SCCL) కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేటాయింపునకు సంబంధించిన అధికారిక ఫైలుపై ఆయన తాజాగా సంతకం చేశారు

. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ సానుకూల దృక్పథంతో ఉన్నారని, అందుకే చట్టపరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రధాని అనుమతితో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయం నుండి తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వాలని నాటి సీఎం కోరినప్పటికీ, అది ఇప్పుడు సాకారమైందని ఆయన గుర్తుచేశారు.

రూ. 64,000 కోట్ల భారీ ఆదాయం..

తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపు ద్వారా సింగరేణి సంస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఈ బ్లాక్‌లో దాదాపు 182 మిలియన్ టన్నుల అత్యంత నాణ్యమైన గ్రేడ్-8 బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 40 నుండి 50 ఏళ్ల పాటు ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుంది

. ఈ గనిని ఓపెన్ ఆక్షన్ (వేలం) లేకుండా నేరుగా సింగరేణికి ఇవ్వడం వల్ల సంస్థకు కనీసం రూ. 2,550 కోట్ల మిగులు ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ. 64,000 కోట్లకు పైగా ఆదాయం జనరేట్ అవుతుంది. రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాదాపు రూ. 16,000 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....