
సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. బెంగళూరు-ధర్మవరం, సంత్రగాచి-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం యశ్వంతపూర్-గుంతకల్లు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైలు
సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక అన్‌రిజర్వుడ్ ప్యాసింజర్ రైలును నడపనున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.
- రైలు నంబర్: 06525
- బెంగళూరులో బయలుదేరు సమయం: ఉదయం 8:15 గంటలు
- ధర్మవరానికి చేరుకునే సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
తిరుగు ప్రయాణంలో 06526 నంబర్‌తో నడిచే రైలు ధర్మవరంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
ఈ రైలు బెంగళూరు కంటోన్మెంట్, బయ్యపనహళ్లి, యల్హంక, రాజన్కుంటి, దొడ్డబళ్లాపూర్, ఒడ్డరహళ్లి, మాకాళిదుర్గ, తొండేబావి, గౌరీబిదనూరు, దేవనహళ్లి, హిందూపురం, మలుగూరు, చాకర్లపల్లి, పెనుగొండ, నారాయణపురం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం బసంపల్లి మీదుగా ధర్మవరం చేరుకుంటుంది. మొత్తం 16 మెము కోచ్‌లతో ఈ రైలును నడపనున్నారు.
సంత్రగాచి-ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
సత్యసాయి జయంతి వేడుకలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బెంగాల్‌లోని సంత్రగాచి నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రెండు అప్ రెండు డౌన్ ట్రిప్పులు నడపనున్నారు.
సంత్రగాచి నుంచి ప్రశాంతి నిలయానికి
- రైలు నంబర్: 08031
- బయలుదేరు తేదీలు: ఈ నెల 17, 24
- బయలుదేరు సమయం: మధ్యాహ్నం 12:40 గంటలు
- ప్రశాంతి నిలయానికి చేరుకునే సమయం: వరుసగా 19, 26 తేదీల్లో రాత్రి 9:30 గంటలు
తిరుగు ప్రయాణం
- బయలుదేరు తేదీలు: ఈ నెల 18, 25
- బయలుదేరు సమయం: రాత్రి 11 గంటలు
- సంత్రగాచికి చేరుకునే సమయం: వరుసగా 20, 27 తేదీల్లో ఉదయం 8 గంటలు
ఈ ప్రత్యేక రైలు ఖరగ్‌పూర్, బాలేశ్వర్, భద్రక్, జైపూర్ కేయోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, గుత్తి, ధర్మవరం మీదుగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి చేరుకుంటుంది.
