సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. బెంగళూరు-ధర్మవరం, సంత్రగాచి-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం యశ్వంతపూర్-గుంతకల్లు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైలు

సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక అన్‌రిజర్వుడ్ ప్యాసింజర్ రైలును నడపనున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.

  • రైలు నంబర్: 06525
  • బెంగళూరులో బయలుదేరు సమయం: ఉదయం 8:15 గంటలు
  • ధర్మవరానికి చేరుకునే సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు

తిరుగు ప్రయాణంలో 06526 నంబర్‌తో నడిచే రైలు ధర్మవరంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

ఈ రైలు బెంగళూరు కంటోన్మెంట్, బయ్యపనహళ్లి, యల్హంక, రాజన్‌కుంటి, దొడ్డబళ్లాపూర్, ఒడ్డరహళ్లి, మాకాళిదుర్గ, తొండేబావి, గౌరీబిదనూరు, దేవనహళ్లి, హిందూపురం, మలుగూరు, చాకర్లపల్లి, పెనుగొండ, నారాయణపురం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం బసంపల్లి మీదుగా ధర్మవరం చేరుకుంటుంది. మొత్తం 16 మెము కోచ్‌లతో ఈ రైలును నడపనున్నారు.

సంత్రగాచి-ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

సత్యసాయి జయంతి వేడుకలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బెంగాల్‌లోని సంత్రగాచి నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రెండు అప్ రెండు డౌన్ ట్రిప్పులు నడపనున్నారు.

సంత్రగాచి నుంచి ప్రశాంతి నిలయానికి

  • రైలు నంబర్: 08031
  • బయలుదేరు తేదీలు: ఈ నెల 17, 24
  • బయలుదేరు సమయం: మధ్యాహ్నం 12:40 గంటలు
  • ప్రశాంతి నిలయానికి చేరుకునే సమయం: వరుసగా 19, 26 తేదీల్లో రాత్రి 9:30 గంటలు

తిరుగు ప్రయాణం

  • బయలుదేరు తేదీలు: ఈ నెల 18, 25
  • బయలుదేరు సమయం: రాత్రి 11 గంటలు
  • సంత్రగాచికి చేరుకునే సమయం: వరుసగా 20, 27 తేదీల్లో ఉదయం 8 గంటలు

ఈ ప్రత్యేక రైలు ఖరగ్‌పూర్, బాలేశ్వర్, భద్రక్, జైపూర్ కేయోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, గుత్తి, ధర్మవరం మీదుగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి చేరుకుంటుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *