D Spiritual: Nov 18: తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శ్రీ ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. టీటీడీ విద్యాసంస్థల్లో నిర్వహణ తీరుపై కమిషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.

ముందుగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలోని వంటశాల, స్టోర్‌ను కమిషన్ బృందం పరిశీలించింది. అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసింది. వంటశాల, స్టోర్‌లో పాటిస్తున్న పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణ, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చైర్‌పర్సన్, అధికారులను అభినందించారు.

అనంతరం ఇతర విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సమగ్ర సంక్షేమం కోసం టీటీడీ చేపడుతున్న చర్యలను సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సంస్థలు చేస్తున్న కృషిని పరిశీలించారు.

ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు శ్రీ గాంధీ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ వి. శివశంకర్, సంరక్షణ అధికారి శ్రీమతి జె. దేవయాని, టీటీడీ ఏఈవో శ్రీమతి బి. అమ్ములు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతమ్మతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *