D Spiritual: Nov 19: తిరుమల: కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటలు

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

బుధవారం మొత్తం 77,092 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి 27,615 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానానికి రూ.4.55 కోట్ల ఆదాయం లభించింది.

ఇక భక్తుల సౌకర్యార్థం 4.19 లక్షల లడ్డూలను విక్రయించగా, 1.81 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం, వసతి, అన్నప్రసాద పంపిణీ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *