
హైదరాబాద్‌లోని మెటా కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేసింది కేవలం కార్యాలయ అద్దాలను మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ హైదరాబాద్ ప్రతిష్ఠపై నమ్మకాన్ని కూడా దెబ్బతీశారని ఆయన విమర్శించారు.
ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గూండాయిజం, విధ్వంసక చర్యలతో దేశానికి పరిశ్రమలను తీసుకురావాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఒక్కటైనా తీసుకొచ్చారా? అంటూ నిలదీశారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సస్పెండ్ చేశారనే ఆరోపణలతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో ఉన్న మెటా కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సస్పెండ్ చేసిన ఖాతాలపై విధించిన ఆంక్షలను వారం రోజుల్లోగా తొలగించాలని మెటా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 21 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
మరోవైపు, మెటా కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో హైదరాబాద్‌కు మెటా వంటి అంతర్జాతీయ సంస్థను ఒక్కటైనా తీసుకొచ్చారా? అంటూ ప్రశ్నించారు. పరిశ్రమలను, పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడానికి గూండాయిజమే మార్గమని భావిస్తున్నారా? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా నిలదీశారు.
బ్రాండ్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందించడం ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. అలాంటి హైదరాబాద్‌లోని మెటా కార్యాలయంపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గొప్ప విజయంగా భావిస్తూ, దాని గురించి గొప్పలు చెప్పుకోవడం విచారకరమని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో మెటా వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థను ఒక్కటైనా హైదరాబాద్‌కు తీసుకొచ్చిందా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. దేశానికి కంపెనీలు, పెట్టుబడులు తీసుకురావడానికి గూండాయిజమే మీ మార్గమా? అని నిలదీశారు.
దేశంలోనే అతిపెద్ద మెటా క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. సంస్థకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇవ్వడంతోనే మెటా హైదరాబాద్‌ను ఎంచుకుందని పేర్కొన్నారు. మెటా కార్యాలయం వద్ద జరిగిన దాడి కేవలం అద్దాలను మాత్రమే ధ్వంసం చేయలేదని, బ్రాండ్ హైదరాబాద్‌పై అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
2010లో హైదరాబాద్‌లో మెటా తొలి అడుగు
మెటా సంస్థ 2010లో హైదరాబాద్‌లో తన తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అదే ఏడాది మే 10న ఫేస్బుక్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ హైదరాబాద్‌లో రిజిస్టర్ అయింది. అనంతరం 2010 సెప్టెంబర్‌లో రహేజా మైండ్‌స్పేస్‌లో కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది.
కాలక్రమేణా ఉద్యోగుల సంఖ్య పెరగడంతో రాయదుర్గంలోని ది స్కైవ్యూ కాంప్లెక్స్‌లో మెటా తన అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. 2024లో సుమారు 3.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలానికి లీజ్‌ను పునరుద్ధరించిన సంస్థ.. 2025లో అదనంగా మరో 70 వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
