Thalliki Vandanam: ఈ రెండు పనులు ఇంకా పూర్తి చేయలేదా..? తల్లికి వందనం కట్.. అకౌంట్లో డబ్బులు పడనట్లే..

Date:

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. లబ్దిదారులు ఎప్పుడెప్పుడు నిధులు వస్తాయా అని ఎదురుచూస్తుండగా.. గురువారం ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించింది.

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. నిధుల విడుదలకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 22న ‘ తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేయనున్నట్లు కూటమి సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 16,17,18వ తేదీల్లో జమ చేస్తామని ముందుగా ప్రకటించగా.. కొన్ని కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీన విడుదల కావడంతో లబ్దిదారులు ఊరట చెందుతున్నారు. గత నెలలోనే స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా అని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవ్వగా.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీరికి కూడా పథకం వర్తింపు

ఈసారి తల్లికి వందనం పథకంలో కీలక మార్పులు చేశారు. దాదాపు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా పథకం వర్తింపచేయనున్నారు. శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా.. ఈ రెండు వర్గాల వారికి పథకం కింద నిధులు అందలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ నిబంధనలను తొలగించింది. ఇక ఎప్పటిలాగే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు వరకు చదివే విద్యార్థులకు యథావిధిగా ఆర్ధిక సాయం అందనుంది. ఈ పథకం కింద ప్రతీ ఏడాది రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణకు రూ.2 వేలు పోనూ.. ఒక్కో విద్యార్థి తరపున తల్లిదండ్రుల ఖాతాలో రూ.13 వేలు జమ కానున్నాయి.

బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ తప్పనిసరి!

‘తల్లికి వందనం’ పథకం లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పథకం డబ్బులు పొందాలంటే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ తప్పనిసరి అని పేర్కొంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐతో తప్పనిసరిగా మ్యాపింగ్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ రెండు పెండింగ్‌లో ఉంటే అకౌంట్లో డబ్బులు పడవని తెలిపింది. ఈ విడతలో ఈ పథకం కింద మొత్తం 42,70,902 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం రూ.10,120 కోట్లు గురువారం విడుదల చేస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్ లింక్, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయి ఉండాలి. ఏవైనా సమస్యలుంటే సమీప సచివాలయాన్ని సంప్రదించాలని కూటమి ప్రభుత్వం కోరింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...