AA23’లో బుట్టబొమ్మ హంగామా.. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే?

Date:

గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘AA23’పై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో కథానాయికగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్ కానుంది.

‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన ప్లాన్ చేస్తున్న చిత్రాలు భారతీయ చిత్రసీమలో భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటిస్తోన్న ‘రాకా’ చిత్రంపై పాన్ వరల్డ్ రేంజో భారీ క్రేజ్ నెలకొంది. ఈ వరుసలో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ చేతులు కలపడం టాలీవుడ్ , కోలీవుడ్‌లతో పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. లోకేష్ మార్క్ పవర్‌ఫుల్ టేకింగ్, విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ శైలికి బన్నీ మాస్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బన్నీ కెరీర్‌లో 23వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘AA23’ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంటోంది.

ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. లోకేష్ కనగరాజ్ తన చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలను ఎంతో స్టైలిష్‌గా, ప్రభావవంతంగా డిజైన్ చేస్తారనే పేరుంది. ఈ నేపథ్యంలో, బన్నీ-పూజాల కాంబినేషన్‌ను ఆయన ఏ రీతిలో ఆవిష్కరిస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....