శ్రీ సత్యసాయి శత జయంతి, హాజరైన ప్రధాని మోదీ.. పుట్టపర్తికి తరలివచ్చిన ప్రముఖులు

Date:

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. అంతేకాకుండా శ్రీ సత్యసాయి బాబా ఉత్సవాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా, 9 కేజీల బంగారంతో తయారు చేసిన బాబా ఉత్సవ మూర్తిని మంగళవారం వెండి రథంపై ఊరేగించారు.

మంగళవారం (నవంబర్ 18) పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయిబాబా శివైక్యం తర్వాత జరుగుతున్న అదిపెద్ద వేడుకలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రశాంతి నిలయానికి చేరుకుని.. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ వెంట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఆ తర్వాత హిల్‌ వ్యూ స్టేడియానికి మోదీ వెళ్లారు. దీంతో, హిల్ వ్యూ ఆడిటోరియం మొత్తం ఎ‌స్‌పీజీ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లింది. కాగా, పుట్టపర్తిలోని సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నేపథ్యంలో.. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకీ మొగ్గలు రావాలంటే.. ఈ ఒక్క స్పూన్ వేయండి! నర్సరీలో పాటించే చిట్కా ఇదే.

ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు....

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...