కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. దర్జాగా సెలవులు తీసుకోవచ్చు, ఉత్తర్వులు జారీ

Date:

మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు శుభవార్త. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వారికి 4 సీఎల్స్, 1 ఐచ్ఛిక సెలవు, 2 ప్రత్యేక సీఎల్స్, లేడీ టీచర్లకు అదనంగా మరో ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వారి సెలవుల సమస్య పరిష్కారమైంది. మొత్తం 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు పండగే. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కొత్త టీచర్లకు సెలవులు మంజూరు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ‘అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సీఎల్స్‌ 4, ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్‌ హాలిడే) ఒకటి, ప్రత్యేక సీఎల్స్‌ 2, ఉపాధ్యాయినులకు (లేడీ టీచర్లకు) అదనపు ప్రత్యేక సెలవు ఒకటి’ చొప్పున మంజూరు చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు తమకు సెలవులు కావాలని కోరారు.. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి సెలవులు మంజూరు చేసింది. మొత్తానికి వీరి సెలవుల సమస్య పరిష్కారం అయ్యింది.. వారికి సెలవులు మంజూరు కావడంతో ఆనందంలో ఉన్నారు. ఈ ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరిన సంగతి తెలిసిందే.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...

షూటింగ్‌కు వెళ్లి బయటకు పంపారు.. అదే ఇంటిని సొంతం చేసుకున్న కింగ్ ఖాన్!

ముంబై బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే...

నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అసలు కారణం ఇదే!

బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం...

మళ్లీ తెర పైకి జమిలి!

హైదరాబాద్‌, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో...