ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే’.. ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ షాక్

Date:

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (Fee Structure) అన్ని పాఠశాలలు..

హైదరాబాద్‌, ఆగస్ట్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (Fee Structure) అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఉంచాలని విద్యాశాఖ సూచించింది. అలాగే పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో కూడా ఫీజుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించింది.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల విషయంలో స్పష్టత కల్పించడం, అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలలు నిర్ణయించిన ఫీజుల వివరాలు, ఇతర ఛార్జీలకు సంబంధించిన సమాచారం పారదర్శకంగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఫీజుల విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా, విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...