బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీంతో పసిడి ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా పడింది. ఫలితంగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు నాలుగైదు రోజుల నుంచి మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరువగా వెళ్లిన తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభించింది.
అయితే మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర మాత్రం బంగారానికి భిన్నంగా కదులుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.1,50,000 వద్ద ట్రేడవుతోంది. గత వారం కిలో వెండి ధర రూ.1,60,000 వరకు ఉండగా, వారం రోజుల్లోనే దాదాపు రూ.10,000 మేర తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4,449 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర 1.44 శాతం పెరిగి ఔన్సుకు 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో పసిడిపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు ఏ దిశగా కదులుతాయనేది ఆసక్తికరంగా మారింది.
