
ఢిల్లీలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటు లోపలి ప్రాంతాల్లోకి కూడా వరద నీరు చేరింది. ముఖ్యంగా ఎంట్రీ గేట్ల వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరద నీటిలోనే ప్రయాణికులు లగేజీ ట్రాలీలను తోసుకుంటూ ఎయిర్పోర్ట్ ఎంట్రీ గేట్ల వైపు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నీటితో నిండిన ఎయిర్పోర్ట్ పరిసరాల దృశ్యాలు, ప్రయాణికుల అవస్థలకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో, వర్షపు నీరు విమానాశ్రయం లోపలికి కూడా చేరింది. ముఖ్యంగా ఎంట్రీ గేట్ల వద్ద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కొందరు ప్రయాణికులు ప్యాంట్లు మడుచుకుని, లగేజీ ట్రాలీలను తోసుకుంటూ ఎయిర్పోర్ట్ గేట్ల వైపు వెళ్లారు. మరోవైపు, భారీ వర్షాల ప్రభావంతో ఢిల్లీకి రావాల్సిన ఐదు విమానాలను లక్నో విమానాశ్రయానికి దారి మళ్లించారు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీగా నిలిచిన నీటిలోనే ప్రయాణికులు లగేజీ ట్రాలీలను తోసుకుంటూ ఎంట్రీ గేట్ల వైపు వెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితిని ఢిల్లీ విమానాశ్రయంలో ఇంతకుముందెన్నడూ చూడలేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షం, నీటి నిల్వల కారణంగా ఎయిర్పోర్ట్లో దాదాపు అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
